విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు” ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్ళంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండగా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి వెన్నెల కిషోర్ నటించిన డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Masthan Sai : మస్తాన్ సాయి- లావణ్య కేసులో వెలుగులోకి మరో ఆడియో
డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించనున్నారమొ వెల్లడించారు మేకర్స్. గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం తన దగ్గరకు సంతాన లేమి సమస్యలతో వచ్చే వారిని ఆయుర్వేద వైద్యాన్ని మోడరన్ మందులతో కలిపి ఎలా ట్రీట్ చేశారనేది హిలేరియస్ గా ఉండబోతోంది. డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని థియేటర్స్ లో నవ్వుల్లో ముంచెత్తనుందని అంటున్నారు మేకర్స్. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.