నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విజయవంతంగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. తాజాగా సీజన్ 4 మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలవగా ఆ ఎపిసోడ్ లో చంద్రబాబు రాజకీయాలు, పవన్ కళ్యాణ్, ఫ్యామిలీ, జైలు జీవితం గురించి.. ఇలా చాలా అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయి జైలులో సుమారు 53 రోజులు గడిపారు. ఈ క్రమంలో బాలకృష్ణ మొదటి రాత్రి జైలులో ఎలా గడిచింది అని అడిగితే దానికి చంద్రబాబు సమాధానమిస్తూ ఆ అరెస్ట్ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను.
Unstoppable Season 4: అమరావతిలో తోడు ఎవరూ లేరు.. మేం కూర్చుని మాట్లాడుకుంటే అదే పండుగ!
నంద్యాలలో మీటింగ్ పూర్తయ్యాక రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బయట గందరగోళం సృష్టించి ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ‘ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు?’ అని ప్రశ్నించా, ‘వారెంట్ ఇస్తున్నాం.. తర్వాత నోటీసు ఇస్తాం’ అనే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుతుందని ఊహించలేం, ప్రజాస్వామ్య దేశంలో.. ఎవరు తప్పు చేసినా.. అదెక్కడ చేశాడో చెప్పి, వాళ్ల సమాధానం తీసుకుని.. దాన్ని పరిశీలించాక తీవ్రమైన విషయం అనుకుంటే.. అప్పుడు అరెస్ట్ చేస్తారు. అది సాధారణంగా జరిగేది. ఆరోజు ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా మరొకరు రావడంతో ‘మీకేం అధికారం ఉంది?’ అని అడిగా, నేను సూపర్‌వైజరీ ఆఫీసర్ అని సమాధానమిచ్చారు. నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నా. ఇన్ని చేసిన నాకు ఆ రోజు అలా జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, అదీ.. రాష్ట్రంలో ఆనాటి పరిస్థితి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నిప్పులా బతికా, తప్పకుండా నేను చేసే ప్రతి పనినీ ప్రజలు తప్పు పట్టకుండా సపోర్ట్ చేస్తారనే విశ్వాసం నాకెప్పుడూ ఉంది, అదే గెలిపించింది అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.