Bunny Vasu About Allu Arjun Movie with Trivikram: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ గారు చెప్పిన కాన్సెప్ట్ నచ్చిందని ఆ సినిమా చేయడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. నిజానికి పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్ కి వాయిదా పడడంతో బన్నీ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు డీల్ చేయని ఒక సబ్జెక్టు డీల్ చేస్తున్నారని, ఇది పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందని అన్నారు.
Allu Family Vs Mega Family: అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం.. మెగా ఫ్యామిలీతో వివాదంలో నిజమిదే!
చాలా భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నాం కాబట్టి అల్లు అరవింద్ అలాగే నిర్మాత నాగ వంశీ ఇప్పటినుంచి డబ్బులు వేటలో పడ్డారని ఫైనాన్షియరులను పట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ చేయడానికి దాదాపు ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుందని ఈ సందర్భంగా బన్నీ వాసు చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ ఫ్యాన్ ఇండియా సబ్జెక్ట్ చేయగలరని అల్లు అర్జున్ నమ్మారని అందుకే సుమారు రెండేళ్ల నుంచి ఈ కాన్సెప్ట్ మీద వాళ్ళు ట్రావెల్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని అని అన్నారు.