Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్లో ఒకప్పుడు వెలిగిన ఐకానిక్ జోడి ‘బ్రాంజెలీనా’ (బ్రాడ్ పిట్ – ఆంజెలీనా జోలీ). హాలీవుడ్లో ఆదర్శ జంటగా ప్రచారంలో ఉన్న ‘బ్రాంజెలీనా’ జంట కొన్నేళ్ల తర్వాత వివాహ బంధంలో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2005లో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ లవ్ కపుల్ సుదీర్ఘకాలం సహజీవనం తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి మొత్తం ఆరుగురు పిల్లలు (మడాక్స్, జహారా, షిలో, పాక్స్, నాక్స్, వివియెన్). వీరిలో ముగ్గురు దత్తత తీసుకున్న పిల్లలు కాగా, ముగ్గురు బ్రాడ్ పిట్ – ఆంజెలీనా జోలీకి కలిగిన పిల్లలు.
2016లో మనస్పర్థలు రావడంతో ఏంజెలీనా జోలీ బ్రాడ్ పిట్‌కు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబ వివాదాలు, పిల్లల కస్టడీ మరియు చ్యాటో మిరావల్ వైన్యార్డ్ వ్యాపారానికి సంబంధించి వీరి మధ్య అనేక కోర్టు కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ హాలీవుడ్ మీడియాతో బ్రాడ్ పిట్ మాట్లాడుతూ ‘ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే తన జీవితంలో అతిపెద్ద పొరపాటని, అసలు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోవాల్సింది. సుదీర్ఘ విడాకుల పోరాటం వల్ల తాను సంపాదించిన ఆస్తిలో దాదాపు సగం భాగం తుడిచిపెట్టుకుపోయింది. ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఇది కోలుకోలేని దెబ్బతీసింది. తన పిల్లలను తనపైకి రెచ్చగొట్టడం వల్ల చివరకు వాళ్ళు తన ఇంటిపేరును (పిట్) కూడా తొలగించుకున్నారు’ అని బ్రాడ్ పిట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం హాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!