2021 ప్రారంభంలోనే… శ్రీలంక సుందరి జాక్విలిన్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని న్యూస్ వచ్చింది. ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే యాంథాలజీతో జాకీ హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసిపోనుంది. ఆరు కథలతో రూపొందే యాంథాలజీ మూవీలో ఆరుగురు దర్శకులతో సహా అందరూ ఆడవాళ్లేనట! ముఖ్యంగా తెరపై కనిపించే వారంతా ఫీమేల్ యాక్టర్సే అంటున్నారు! ఇక మన జాక్విలిన్ లీనా యాదవ్ డైరెక్ట్ చేసే ‘ఏ రైడ్’ అనే కథలో హీరోయిన్ గా నటిస్తోంది.
‘ఉమెన్స్ స్టోరీస్’ హాలీవుడ్ మూవీకి సంబంధించి తన పోర్షన్ షుటింగ్ జాక్విలిన్ గత అక్టోబర్ లోనే పూర్తి చేసింది. ముంబైలో చాలా భాగం పిక్చరైజ్ చేశారు. సిటీలోని ప్రధాన పోలీస్ స్టేషన్ లో కూడా చిత్రీకరణ జరిగింది. సినిమాలో జాక్విలిన్ పోలీస్ పాత్రలో కనిపిస్తుందని టాక్ వినపడుతోంది.
హాలీవుడ్ ఎంట్రీ మాట ఎలా ఉన్నా ఈ ఫారిన్ లేడీ బాలీవుడ్ లో దేసీ మూవీస్ తో బిజిబిజీగా ఉంది. జాన్ అబ్రహామ్ ‘అటాక్’, రణవీర్ సింగ్ ‘సర్కస్’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’ సినిమాల్లో మిస్ ఫెర్నాడెంజ్ కనిపించనుంది. చూడాలి మరి, ఇప్పటికే బీ-టౌన్ లో నిలదొక్కుకోగలిగిన సెక్సీ బ్యూటీ హాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ సాధిస్తుందో…