మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన వారం రోజులకే రూ.101 కోట్ల వసూలు సాధించింది. మలయాళ జానపదం ఆధారంగా సూపర్ ఉమెన్ కధ జోడించి, దర్శకుడు డామినిక్ అరుణ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించగా, నస్లెన్ కె. గఫూర్ కథానాయకుడిగా కనిపించారు. సినిమా కథలో ప్రేమ, యాక్షన్, జానపద వింతలు అద్భుతంగా మిళితమై, ప్రేక్షకులను అలరించింది.
Also Read : Anushka : ఘాటి కోసం అనుష్క శెట్టి రెమ్యునరేషన్..ఎంతో తెలుసా..?
తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, ఆలియా భట్ సినిమా పట్ల ప్రశంసలు కురిపించారు. ప్రియాంక రాసిన ప్రకారం.. ‘భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో సినిమా మన ముందుకు వచ్చింది. ఈ విజయం సాదించిన దుల్కర్ సల్మాన్ టీమ్‌కి అభినందనలు. నేను ఇప్పటికే ఈ సినిమాను నా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకున్నాను. మీరు చూశారా?” అని కామెంట్ చేయగా.. అలియా భట్ కూడా ఈ మూవీపై స్పందిస్తూ, “పౌరాణిక జానపదం, మిస్టరీ అద్భుతమైన సమ్మేళనం ఈ లోక. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి విభిన్నమైన సినిమాకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినిమా రంగానికి ఇది ఒక మంచి అడుగు అని భావిస్తున్నాను” అన్నారు. బాలీవుడ్ హీరోయిన్ లు ఇలా ఇతర బాషకు సంబంధించిన చిత్రం గురించి మాట్లాడటం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పాలి.