స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా మొదటి షో నుండి అనుష్క శెట్టి యాక్టింగ్ పై పాజిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో.. చాలా సీన్స్ లో ఆమె నటన, యాక్షన్, ఎమోషన్స్ మెప్పించాయి.కాగా మొత్తానికి మూవీ పర్వాలేదు అనిపించుకుంది. అయితే తాజాగా ఈ మూవీ కోసం అనుష్క తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది..
Also Read : Peddi : ‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్‌పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్..
అయితే ఈ చిత్రానికి అనుష్క కేవలం రూ.6 కోట్ల పారితోషికం అందుకున్నారని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టికి వచ్చిన క్రేజ్ కు ఒక్క సినిమాకు రూ.10 నుంచి రూ.20 కోట్ల మధ్య పారితోషికం అందుకునే రేంజ్ ఏర్పడింది. కానీ స్వీటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోవడంతో తన రెమ్యునరేషన్ కూడా పడిపోతూ వచ్చింది. మరోవైపు బహుబలి చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, స్వీటీ రెమ్యునరేషన్ పెద్దగా పెరగలేదు. దీంతో కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఘాటి సినిమాకు ఛార్జ్ చేశారంట అనుష్క శెట్టి. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. కానీ ఆమెకు వచ్చిన ఫేమ్ కనుక కరెక్ట్ గా వాడుకుని ఉంటే అనుష్క రెంజ్ ఇప్పటికి టాప్ లోనే ఉండేది అని ఫ్యాన్స్ వాపోతున్నారు.