Bollywood : సీక్వెల్స్ తో బండి లాగిస్తున్న ‘బాలీవుడ్’
- బాలీవుడ్‌కు అచ్చొచ్చిన సీక్వెల్స్
- భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తోన్న ఫ్రాంచేజీ మూవీస్
- అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ చేతిలో ఎక్కువ సీక్వెల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్‌స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్ లాంటి సీక్వెల్స్ బాలీవుడ్ పరువును కొంత నిలబెట్టాయి. అందుకే వరుస పెట్టి ఇన్‌స్టాల్ మెంట్ మూవీస్ తీసేస్తున్నారు. కోట్లు కుమ్మరిస్తుండటంతో స్పెషల్ ఫోకస్ పెంచుతున్నారు మేకర్స్. హీరోస్ సైతం సీక్వెల్స్‌కు సై అనడంతో స్టోరీలు రెడీ చేస్తున్నారు.
Also Read : Pushpa 2: ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ప్రజెంట్ బాలీవుడ్‌లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. వచ్చే ఏడాది మరిన్ని ఫ్రాంచైజీ మూవీస్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయి. అందులో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా నిలుస్తోంది వార్ 2. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో తారక్ యాంటోగనిస్టుగా కనిపించబోతున్నాడన్నది టాక్. అందరికన్నా దోస్తులు అక్షయ్, అజయ్ చేతిలో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ సీక్వెల్స్ ఉన్నాయి. రైడ్ 2, సన్నాఫ్ సర్దార్ 2, దేదే ప్యార్ దే2తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు అజయ్ దేవగన్ . జాలీ ఎల్ఎల్బీ 3, హౌస్ ఫుల్ 5, వెల్కమ్ టు ది జంగిల్ ఇన్ స్టామెంట్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవే కాదు టైగర్ ష్రాఫ్ బాఘీ 4, హృతిక్ క్రిష్ 4 కూడా రెడీ అవుతున్నాయి. రాకేశ్ రోషన్ డైరెక్షన్‌కు రిటైర్ మెంట్ ప్రకటించడంతో.. క్రిష్ 4ను మరో డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నాడు . ఇవే కాదు.. మరిన్ని ఫ్రాంచైజీ మూవీలు రాబోతున్నాయి. మరీ వీటిల్లో ఆడియన్స్ ఏ సినిమాలపై కలెక్షన్లు కుమ్మరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!