బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ఏడడుగులు వేసి ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరో వైపు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. పెళ్లి.. సినీ కెరీర్‌కు ఏమాత్రం అడ్డంకి కాదని ఫ్రూవ్ చేస్తున్నారు. అంతేనా ఓ అడుగు ముందుకేసి.. మదర్ ఫేజ్‌కు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే స్లార్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకొనే మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జాబితాలోకి చేరింది మరో గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ. ద గ్రేటెస్ట్ గిప్ట్ ఆఫ్ అవర్ లైవ్స్.. కమింగ్ సూన్ అంటూ ప్రెగెన్సీని ఎనౌన్స్ చేశారు క్యూట్ కపుల్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా. 2023లో ఈ జంటకు వివాహమైంది. ఇటీవల గేమ్ ఛేంజర్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన కియారా.. ఎప్పుడో టాక్సిక్, వార్ 2 లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు కమిటైంది. ఈ సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. మరీ తన పోర్షన్ షూటింగ్స్ కంప్లీట్ చేసిందా..? లేక ప్రెగ్నెంట్‌తోనే సెట్స్‌లోకి అడుగుపెడుతుందా అని తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఏడాదిలోనే బేబీకి జన్మనివ్వనుంది కియారా.
Anchor Suma: అతి అరుదైన కృష్ణ శిలలతో టాలీవుడ్ నిర్మాత శివాలయం.. సుమ ప్రత్యేక పూజలు
కియారా మాత్రమే కాదు.. ఇదే ఏడాదిలో మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు మదర్ హుడ్ ఎంజాయ్ చేయబోతున్నారు. అనిల్ కపూర్ గారాల పట్టి అతియాశెట్టి-కెఎల్ రాహుల్ దంపతులు ఇదే ఏడాది పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. అలాగే సౌత్ కమ్ నార్త్ బ్యూటీస్ ఇలియానా, అమీజాక్సన్ సెకండ్ టైమ్ తమ ప్రెగ్నెసీలను ఎనౌన్స్ చేశారు. ఇక వీరిద్దరు కూడా ఈ ఏడాదే తమ సెకండ్ చైల్డ్ ను ఎత్తుకోబోతున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీలంతా తల్లులుగా ప్రమోట్ కానుండటంతో.. ఇప్పుడు ఫోకస్ కత్రినావైపుకు మళ్లింది. ఇప్పటికే కత్రినా ప్రెగ్నెంట్ అంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ విక్కీ- కత్రినా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్లీ చావా సక్సెస్ ఎంజాయ్ మెంట్‌లో ఉన్న ఈ కపుల్.. ఎప్పుడు పేరెంటింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారో..?