అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ సినిమా లాగానే మొదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రీజనల్ సినిమాల్లోనే అతి భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు బాగా కలిసి వచ్చిన వైజాగ్ వెళ్లిన అనిల్ రావిపూడి అక్కడే స్క్రిప్టింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో నాలుగు సాంగ్స్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
Harish Shankar: మీరు మంచి సినిమాలు చేస్తే ఎందుకు చూడరు హరీష్ శంకర్?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ కావడంలో భీమ్స్ పాత్ర మరువలేనిది. ఎందుకంటే మనోడు అందించిన మ్యూజిక్ అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. చాలా వరకు ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడంలో ఆ మ్యూజిక్ తన వంతు పాత్ర తాను పోషించింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే మామూలుగానే అంచనాలు భారీగా ఉంటాయి దానికి తోడు కామెడీ ఎక్స్పర్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో భీమ్స్ మ్యూజిక్ అందిస్తూ ఉన్న సినిమా కావడంతో అసలు అన్ని అంశాల మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే కచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇప్పుడే ట్యూన్స్ సిద్ధం చేశారు కాబట్టి సినిమా రిలీజ్ అయ్యేవరకు వాటిని ఇంప్రవైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. మరి ఈ సినిమాని కొద్ది నెలలలో సెట్స్ మీదకు తీసుకువెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారు.