టాలీవుడ్ నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ముగ్గురు ముఖ్యమైన యువ హీరోలు నటిస్తుండటంతో ప్రేక్షకులో అంచనాలు భారీగానే ఉన్నాయి. కుటుంబ కథ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా కనిపించనున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా, ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా . ఈ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ డైలాగ్స్‌తో ఫుల్ ప్యాక్డ్గా ఉండే ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేశారు చిత్రబృందం. ‘బోగి మంటల్లో’ అని సాగే ఈ పాటను రేవంత్, సాహితీ,సౌజన్య ఆలపించారు.