చిత్రసీమకు చెందిన సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో, ఫాలోవర్స్ తో టచ్ లో ఉండడానికి సులభమైన మార్గం సోషల్ మీడియా. కానీ దీని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువగా చెడు కూడా జరుగుతోంది. తాజాగా ఓ టెలివిజన్ నటికి చేదు అనుభవం ఎదురైంది. షాకింగ్ విషయం ఏమిటంటే… ఆమె స్కిన్ కలర్ పై ఈ ట్రోలింగ్ జరగడం. బెంగాలీ బుల్లితెర హీరోయిన్ శృతి దాస్ “త్రినయని” అనే బెంగాలీ సీరియల్ ద్వారా 2019లో టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పటి నుంచి ఈ అమ్మడిపై ట్రోలింగ్ మొదలైంది. కానీ ఇంతకాలం ఆమె ట్రోలింగ్ ను పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తూ వచ్చింది. కానీ ట్రోలర్స్ ఆమెను మరి ఎక్కువగా పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారట. దీంతో ఓపిక నశించిన శృతి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. చివరకు ట్రోల్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం.
Read Also : ‘బీస్ట్’తో జానీ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
ఈ విషయంపై శృతి స్పందిస్తూ “నా చుట్టూ ఉన్నవారంతా ట్రోలింగ్ ను పెద్దగా పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. కానీ అవి సమయంతో పాటు రోజురోజుకూ విషపూరితంగా మారిపోతున్నాయి. న ఫస్ట్ టీవీ సీరియల్ “త్రినయని” దర్శకుడితో నేను రిలేషన్షిప్ లో ఉన్నాను. ఈ విషయం తెలిసిన తరువాత నా క్యారెక్టర్, ప్రతిభను ప్రశ్నిస్తూ ద్వేషపూరిత, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే వారికి ఇలాంటి కామెంట్స్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న అసభ్యకరమైన ట్రోలింగ్ లను జతచేస్తూ శృతి కోల్‌కతా పోలీసులను ఫేస్‌బుక్‌లో ట్యాగ్ చేసింది. పరిశ్రమలో చాలా మంది తన చర్మం రంగును చర్చనీయాంశంగా మార్చారని, సరైన మేకప్ వేసుకోకపోతే తనకు మళ్లీ నటించే అవకాశం లేదని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ 25 ఏళ్ల బ్యూటీ “దేశేర్ మాతి” అనే సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.