గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌజ్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి.
Also Read : Mazaka : తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి షూటింగ్ లైవ్ స్ట్రీమింగ్
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడానికి ఇద్దరు దర్శకులు దాదాపుగా ఫిక్స్ అయ్యారనే చెప్పాలి. వీరసింహారెడ్డితో బ్లాస్టింగ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. జూన్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే బాలయ్య ఓ డిజాస్టర్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడని వార్త టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతుంది. మిస్టర్ బచ్చన్ తో బిగెస్ట్ డిజాస్టర్ కొట్టాడు హరీష్ శంకర్. ఆ ప్లాప్ నుండి తేరుకుని మరో పవర్ఫుల్ కథ రెడీ చేసాడట హరీష్ శంకర్. ఆ కథను నందమూరి బాలయ్య కు ఇటీవల వినిపించాడట హరీష్. అయితే గబాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదని మార్పులు చేర్పులు సూచించినట్టు తెలుస్తోంది. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది.