Balakrishna: బాలయ్యా.. ఏందయ్యా ఈ జోరు.. కుర్ర హీరోలతో పోటీనా?
- ఒకపక్క సినిమాలు ఒకపక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా నందమూరి బాలకృష్ణ
- గోపి ఆచంట
- రామ్ ఆచంట నిర్మించబోతున్న అఖండ 2
- దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna will begin two new films after NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక ఒక రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన తన ఫోకస్ అంతా సినిమాల మీదకు షిఫ్ట్ చేశాడు. అందుకే ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నా సరే ఆయన వాటికి హాజరుకాకుండా తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నందమూరి బాలకృష్ణ 109 సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని అక్టోబర్ లేదా నవంబర్ కి పూర్తి చేసి మంచి రిలీజ్ డేట్‌కు దింపాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే సినిమా అయిపోయిన వెంటనే బాలకృష్ణ రెండు సినిమాలు ఒకేసారి మొదలుపెట్టబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Shruti Haasan: అప్పుడే పదిహేనేళ్లా? డాటర్ ఆఫ్ కమల్ టు శృతి జర్నీ!
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
అందులో ఒకటి అఖండ 2. ఈ సినిమాని అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి కాకుండా 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఆమె ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతోంది. ఈ బోయపాటి సినిమాతో పాటు బాలకృష్ణ మరొక సినిమా కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. కాబట్టి అనౌన్స్ చేసే సమయంలో డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాలకృష్ణ ఊపు చూస్తుంటే కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడా అని అనిపించక మానదు. అయితే కుర్ర హీరోలే ఆచితూచి సినిమాలు చేస్తుంటే బాలకృష్ణ మాత్రం మంచి జోష్ లో సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!