ప్రముఖ కళాకారుడు, ‘బలగం’ సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు. ‘బాబు మొత్తం జీవితం నాటకరంగం లో గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది’ అని వేణు అన్నారు. ఇక బలగం సినిమాలో భాగమైన నటీనటులందరికీ మంచి పేరుతో పాటు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
Also Read : NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నేషనల్ క్రష్ ..?
కొమురయ్య పాత్రలో అద్భుతంగా నటించిన సుధాకర్ ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. కానీ ఇదే సినిమాలో, కొముయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన, జీవీ బాబు మాత్రం అవకాశాల్లేక అనారోగ్యంతో మంచం పట్టాడు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన, వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందుకున్నప్పటికి.. లాభం లేకుండా పోయింది.. ఆయన కుటుంబం ఎంతగానో ప్రయత్నించిన కూడా బ్రతికించుకోలేక పోయ్యారు.