బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “భజరంగీ భాయిజాన్” చిత్రంలో నటించిన చిన్న పాప మున్నీ గుర్తుందా? తెల్లగా, క్యూట్ గా ఉండి వెండితెరపై ప్రేక్షకులను మురిపించిన ఆ చిన్నారి ఇప్పుడు టీనేజీలోకి అడుగు పెట్టింది. ఆమె అసలు పేరు హర్షాలి మల్హోత్రా. తాజాగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ తన 13వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ అమ్మాయి టీనేజీ లుక్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె తల్లి ఇంస్టాగ్రామ్ ద్వారా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోలు, పిక్స్ షేర్ చేసింది హర్షాలీ. ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ చిన్నదానికి అప్పుడే సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం విశేషం. మరి ఈ బ్యూటీ మరి కొన్నేళ్లలో హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03)