ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వచ్చిన మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదలై మంచి టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) మాట్లాడుతూ* .. ‘‘బ్యాడ్ గాళ్స్’ నిడివి విషయంలో చిన్నది కానీ.. కంటెంట్ విషయంలో మాత్రం చాలా పెద్దది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ప్రధాన బలం. ఆ రెండు కారణాలతో మా సినిమాని అందరూ చూడొచ్చు. మా టీజర్, సాంగ్, ట్రైలర్ నచ్చితేనే థియేటర్‌కు రమ్మన్నాను. ఇప్పుడు ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాలో రిలీజ్ చేసిన మా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మా ‘బ్యాడ్ గాళ్స్’ మూవీని ఆడియెన్స్ హిట్ చేశారు. ఎంత కాంపిటీషన్‌లో వచ్చినా మనం హిట్టు కొడతామని మా నిర్మాతలు ముఖ్యంగా నమ్మారు. ఇప్పుడదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో నిర్మాతలున్నారు. మా సినిమాని ఎంతో నిజాయితీగా తీశాం. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతి రత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో మా చిత్రం అలా ఉంటుంది. జాతి రత్నాలు, మ్యాడ్ చిత్రాలు మీకు నచ్చితే మా ఈ మూవీ కూడా నచ్చుతుంది. మా సినిమాకు ఇంకా ఇలానే అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.