టాలీవుడ్ ఆరా స్టార్టైంది బాహుబలికి తర్వాత అన్నదీ నో డౌట్. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసి సో కాల్డ్ స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టించారు రాజమౌళి అండ్ ప్రభాస్. టాలీవుడ్డా అది ఎక్కడ ఉంది అనే బాలీవుడ్ పెద్దలకు ఒక్క సినిమాతో చెక్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. బాహుబలితో బాలీవుడ్ కు మాత్రమే హాలీవుడ్‌కు కూడా తెలిసేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్. ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది.
Also Read : HHVM : హరిహర రైట్స్ వద్దు.. OG రైట్స్ ముద్దు..
ఇక ఈ సినిమా రీసెంట్లీ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. దీంతో టూ సిరీస్‌ను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది టీం. అయితే రెండు సిరీస్ లు కలిపి దాదాపు 6 గంటల సినిమా ఉంటుంది. ఆ మొత్తాన్ని ఒకే సినిమాగా ఎంత రన్ టైమ్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే 4 గంటల నిడివితో ఒక వెర్షన్ రెడీ అయింది. కొన్ని అనవసరమైన సీన్స్ ను కట్ చేసి ఫస్ట్ రిలీజ్ లో డిలీట్ చేసిన ఫుటేజ్ ను యాడ్ చేశారట. కాని నాలుగు గంటల నిడివి అంటే చాలా ఎక్కువ అందుకోసమే ఇంకా ట్రిమ్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం దర్శక ధీరుడు రాజమౌళి రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటి వరకు ఎడిట్ చేసిన వర్షన్ ను ఒకసారి చెక్ చేసి మార్పులు చేర్పులు చేసి రన్ టైమ్ ను ఫిక్స్ చేయాల్సి ఉంది. 10 ఏళ్ల క్రితం సంచనాలు నమోదు చేసిన బాహుబలి అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ కానుంది.