ఎన్ని రకాల సినిమాలు వచ్చినప్పటికీ కూడా, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకుపోతాయి. అలాంటి వాటిలో ‘అవతార్’ ఒకటి. హాలీవుడ్ సంచలన దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్’ ఫ్రాంచైజీ, భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బద్దలుకొట్టే కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే రెండు భాగాలు అలరించగా, మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక..
Also Read : Buchibabu Sana : ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుకు బంపర్ ఛాన్స్ – బాలీవుడ్ కింగ్‌తో భారీ సినిమా?
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 3 గంటల 15 నిమిషాలు (195 నిమిషాలు) నిడివితో లాక్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా వచ్చిన ‘అవతార్’ (2009) 2 గంటల 58 నిమిషాలు, రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ 3 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో భాగం వాటన్నింటిని మించేలా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో పండోరా ప్రపంచానికి కొత్త విలన్ ‘వరాంగ్’ను పరిచయం చేయనున్నారు. ఈ నావి పాత్రలో నటి ఊనా చాప్లిన్ కనిపించబోతోంది, ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది. పండోరా ఆత్మ అయిన ఐవా (Eywa)కు వ్యతిరేకంగా నిలబడే తొలి నావి పాత్ర ఇదే కావడంతో కథలో భారీ ట్విస్ట్ ఉండబోతుందని చెప్పవచ్చు.
ఇప్పటికే జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ, ఈ భాగం గత రెండు సినిమాల కంటే మరింత ఉత్కంఠభరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుందని తెలిపారు. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా, సిగోర్నీ వీవర్, కేట్ విన్‌స్లెట్ వంటి ప్రధాన తారాగణం ఇందులో కొనసాగుతుండగా, ఊనా చాప్లిన్ కొత్తగా జాయిన్ అవుతున్నారు. మొత్తం ఐదు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో మూడో భాగం తరువాత నాలుగోది 2029లో, ఐదోది 2031లో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ‘అవతార్ 3’ విడుదల సమయంలోనే మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌ను థియేటర్లలో అటాచ్ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, అవతార్ మరియు మార్వెల్ అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారనుంది.