‘ఉప్పెన’ తో సంచలన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు బుచ్చిబాబు సనా, మొదటి సినిమాకే తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్నాడు. చిన్న పాయింట్‌ను రెండు గంటలపాటు హై ఎమోషన్‌తో చూపిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్లకు కట్టిపడేసిన బుచ్చిబాబు, ఇండస్ట్రీలో తొలి మూవీతోనే స్టార్ డైరెక్టర్ రేంజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ని తెరకెక్కి స్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన వీడియోలతో భారీ అంచనాలు సృష్టించింది. ఫ్యాన్స్ మధ్య ‘పెద్ది’ హిట్ అవ్వడం ఖాయమని అభిప్రాయం నెలకొంది. ఇక ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుదే దర్శకత్వంలో మరో భారీ సినిమా సిద్ధమవుతోందన్న వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చ గా మారాయి.
Also Read : Renu Desai : ఆయన పిలిస్తే కచ్చితంగా వెళ్తా – రేణు దేశాయ్..
తాజాగా మైత్రి మూవీ మేకర్స్ తెలుగు మార్కెట్‌ను దాటి, తమిళం–హిందీ భాషల్లో కూడా వరుస ప్రాజెక్టులు చేస్తుంది. ఇప్పటికే తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లి, హిందీలో జాట్ వంటి సినిమాలు తెరకెక్కించిన ఈ బ్యానర్ ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక సూపర్ క్రేజీ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తోందని టాక్. ఇండస్ట్రీ రూమర్స్ ప్రకారం, మైత్రి ప్రతినిధులు ఇటీవల బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌ను కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌పై చర్చలు జరిపి, అడ్వాన్స్ కూడా చెల్లించారట. ఈ సినిమా దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను బుచ్చిబాబు సనాకే అప్పగించారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఉప్పెన’ నుంచి ‘పెద్ది’ వరకు తన నైపుణ్యాన్ని నిరూపించిన బుచ్చిబాబు మూడో సినిమాకే షారుఖ్ ఖాన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగానే టాలీవుడ్–బాలీవుడ్ వర్గాల్ని షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉండగా, అది పూర్తయ్యాకే షారుఖ్ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ రావచ్చని అంటున్నారు.