హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో సినీ ప్రియులకు ఒక కొత్త వినోద గమ్యం అందుబాటులోకి వచ్చింది. ఏషియన్ సినిమాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన ఏషియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఆధునిక థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్, శిరీష్ రెడ్డితో పాటు ఇతర సినీ ప్రముఖులు సంయుక్తంగా ప్రారంభించారు.
Also Read:NTR-RCB: ఇది కదా గిఫ్ట్ అంటే?
బాలాపూర్‌లోని ఈ ఆసియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ అత్యాధునిక సాంకేతికతతో, సౌకర్యవంతమైన సీటింగ్ వ్యవస్థతో, అత్యుత్తమ సౌండ్ అలాగే విజువల్ క్వాలిటీతో సినీ ప్రేక్షకులకు అసాధారణమైన అనుభవాన్ని అందించడానికి సిద్ధం చేశారు. ఈ కాంప్లెక్స్‌లో మల్టిపుల్ స్క్రీన్లు ఉండటంతో వివిధ సినిమాలను ఒకేసారి ప్రదర్శించే అవకాశం ఉంది. ఇందులో క్రిస్టీ 4K ప్రొజెక్టర్, QSC 7.1 సరౌండ్ సౌండ్, పెద్ద ఏషియన్ మాక్స్ స్క్రీన్, డాల్బీ ఎట్మాస్ సౌండ్ సిస్టమ్, 4K ప్రొజెక్షన్, లగ్జరీ సీటింగ్ వంటి సౌకర్యాలు సినీ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి.
Also Read:V. Hanumantha Rao: రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్‌ని వ్యతిరేకించలేదు..
హైదరాబాద్‌లోని బాలాపూర్‌లోని ఆసియన్ సూపర్ అని పిలువబడే ఈ థియేటర్ జూన్ 5న గ్రాండ్ రీఓపెనింగ్తో మారనుంది. బాలాపూర్ ప్రాంతం హైదరాబాద్‌లోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఇక ఏషియన్ సినిమాస్ దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏషియన్ సినిమాస్ థియేటర్లు సినీ ప్రియులకు సేవలను అందిస్తున్నాయి.