తమిళ్ స్టార్ హీరో ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కరోనా ముందు ఆర్య నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. కానీ కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో, 2021 జూన్ లో ఆర్య నటించిన ‘సార్పట్ట పరంబరై’ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. పా రంజిత్ కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. దుశారా విజయన్ హీరోయిన్‌గా నటించగా, పశుపతి ముఖ్య పాత్రలో నటించాడు. కథ ప్రకారం ఎంతో ఆకట్టుకున్న ఈ మూవీ సీక్వెల్స్ కోసం, అటు తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ సీక్వెల్ పై అప్ డేట్స్ ఇచ్చింది.
Also Read: Alia Bhatt : ప్రతి సైనికుడి వెనుక ఒక తల్లి కడుపుకోత ఉంటుంది..
తాజాగా ‘సార్పట్ట’ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించి త్వరలో ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లనుందని తెలిపారు. దీంతో ఆర్య ఫ్యాన్స్, ఈ సినిమా అభిమానులు ఈ సారి మరింత అదిరిపోవాలి, అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే..
పల్లెటూళ్ళో బాక్సింగ్ బాగా ఆడే ఆర్య కొన్ని కారణాల వల్ల బాక్సింగ్ కి దూరమవుతాడు. తర్వాత మళ్ళీ బాక్సింగ్ రింగ్ లోకి వచ్చి తన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది. కానీ తన శరీరం సహకరించదు. ఇలాంటి పరిస్థితుల నుంచి తన శరీరాన్ని బాక్సింగ్‌కి అనుగుణంగా మార్చుకొని విలన్ ల మీద ఎలా గెలిచాడు అనేది కథ. ఇందులో చూపించిన బాక్సింగ్ సన్నివేశాలు, ఓడిపోయిన ఆర్య ఎమోషన్స్, ఆర్య కి ట్రైనింగ్ ఇచ్చిన క్యారెక్టర్‌లో పశుపతి నటన.. ఇవన్నీ బాగా పండటంతో సినిమా సూపర్ హిట్ అయింది. కాగా రెండో భాగం ఎలా ఉండబోతుందో చూడాలి.