Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Sarja: తన పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారంపై సీనియర్ నటుడు అర్జున్ సర్జా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన కూతురి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజనా వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లి వేడుకల తర్వాత ఐశ్వర్య అర్జున్ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఊహాగానాలు కాస్తా శృతి మించడంతో ఒక తండ్రిగా అర్జున్ సీరియస్ అయ్యారు.
ఈ వివాదంపై స్పందించిన అర్జున్, తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక తండ్రిగా నా కూతురిని లక్ష్యంగా చేసుకుని ఆధారాలు లేని, అవమానకరమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేను. నటులుగా మేము ప్రజాజీవితంలో ఉన్నప్పుడు విమర్శలు, ఊహాగానాలు సహజమని అర్థం చేసుకుంటాం. కానీ సెలబ్రిటీలం అయినంత మాత్రాన మా గురించి ఏది పడితే అది మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. ఈ అసత్య ప్రచారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం” అని అర్జున్ తేల్చి చెప్పారు.
Also Read
పత్రికా రంగాన్ని తానెంతో గౌరవిస్తానని చెప్పిన ఆయన, నిజానిజాలు, విశ్వసనీయత గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఒక తండ్రిగా తన కూతురికి ఎప్పుడూ అండగా ఉంటానని చెబుతూనే, సమాజంలోని మహిళల పట్ల బాధ్యతగా ఉండాలని కోరారు. “ప్రతి మహిళ గౌరవాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా కుటుంబం నుంచి మద్దతు లేని మహిళలపై ఇలాంటి నిరాధార ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వారి జీవితాన్ని ఇవి మరింత క్లిష్టతరం చేస్తాయి. ఏ మహిళ కూడా ఇలాంటి పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదు” అని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!