Actor Simbu Helps Comedian Vengal Rao: సినిమాలలో రొమాన్స్ కూడా ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ చేయడం కష్టమని చాలా మంది ప్రముఖ నటీనటులు చెప్పడం విన్నాం. అయితే హాస్య సన్నివేశాలతో జనాన్ని కడుపుబ్బా నవ్వించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే తమిళం విషయానికి వస్తే వారిలో వడివేలు, గౌండమణి, సెంథిల్, సంతానం, వివేక్, యోగిబాబు, సూరి తదితరులు ఉన్నారు. ఈ నటుల ఎదుగుదలకు వారి సహనటులు కూడా కారణమే. ముఖ్యంగా వడివేలు హాస్య సన్నివేశాలు హిట్ కావడానికి ఆయనతో నటించిన సింహముత్తు, బోండా మణి, వెంకళ్ రావు, అల్వా వాసు, భావ లక్ష్మణన్ వంటి సహ నటుల సహకారం కూడా ప్రధాన కారణం. అయితే వడివేలు స్థాయికి తగ్గట్టుగా లీడింగ్ కమెడియన్ స్థాయిని వారు అందుకోలేకపోయారు.వెంగళ్ రావు వడివేలుతో హాస్య సన్నివేశాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అతని పేరు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఆయన నటించిన హాస్య సన్నివేశాలు చెబితే వెంటనే తెలిసిపోతుంది.
ముఖ్యంగా కందసామిలో వడివేలుతో కొబ్బరికాయలు కొట్టే సన్నివేశం మొదలుకొని చైనా ఠాణా 007లో అతని చేయి కొరుక్కుంటానని బెదిరించే పాత్ర వరకు, అతను మరియు వడివేలు కలిసి చాలా హిట్ కామెడీ సన్నివేశాలలో నటించారు. కొన్నాళ్లు వడివేలు సినిమాల్లో నటించకుండా నిషేధం విధించిన కాలంలో వెంగళ్ రావు కూడా ఆచూకీ లేకుండా పోయాడు. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న వెంగళ్ రావు.. ఒక చేయి, ఒక కాలు పోగొట్టుకున్నానని, ప్రస్తుతం చికిత్సకు కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నానని కన్నీటి పర్యంతమైన వీడియోను రిలీజ్ విడుదల చేశారు. ఇది చూసి చాలా మంది వడివేలు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ వడివేలుకి విషయం తెలిసిందో లేదో కానీ ఆయన సహాయం చేయకపోయినా, నటుడు శింబు వెంగల్ రావుకు సహాయం చేశాడు. వెంకళ్ రావు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. శింబు చేసిన పనికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.