టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ హీరో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తుండగా. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అనుష్కను జేజమ్మ, దేవసేన వంటి పవర్ ఫుల్ రోల్స్ చూసినప్పటికి.. మొట్టమెదటి సారిగా ఆమెను వయలెంట్ రోల్‌లో చూపించే క్రెడిట్ క్రిష్ జాగర్లమూడికి దక్కింది. దీంతో అనుష్కని తెరపై ఎప్పుడు చూస్తామా.. అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై..
Also Read : Dilraju : టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”
వార్తలు వినపడుతున్నాయి. మొదట ఏప్రిల్ 18న ఈ మూవీ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికి, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను జూలై రెండో వారంలో తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ జూన్‌లో రిలీజ్ డేట్స్ ఖాళీ లేవు. మొదటి వారం కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రెండో వారం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, మూడో వారం ధనుష్ ‘కుబేర’, నాలుగో వారం విష్ణు మంచు ‘కన్నప్ప’ వంటి వరుస పాన్ ఇండియా సినిమాలు లైన్ లో ఉన్నాయి. జూలై మొదటి వారంలో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ కు రెడీ అయింది. అంటే జూలై రెండవ వరం స్లాట్ ఖాళీగా ఉందన్నమాట. అందుకే అప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేశారట. మరి జూలై రెండో వారంలో అయిన ‘ఘాటీ’ కి సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉందంటారా..?