ప్రముఖ బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే ఎప్పుడూ, ఏదో ఒక విషయం ఇష్టం వచ్చిన స్టెట్‌మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెరలేపాడు. తాజాగా ఓ మీడియా తో ఈ పాన్ ఇండియా చిత్రాల పై తీవ్ర విమర్శలు చేశాడు. వాటి కోసం కేటాయిస్తున్న భారీ బడ్జెట్‌లు, నిర్మాణానికి తీసుకుంటున్న ఎక్కువ సమయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : kajal : ఆ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్..?
ఆయన మాట్లాడుతూ.. ‘మంచి కథలు చెప్పడం కంటే కేవలం పెద్ద సెట్‌లు వెయ్యడం, ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కాదు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ వంటి విజయవంతమైన చిత్రాలు పద్ధతినే ఇప్పుడు చాలా పాన్ ఇండియన్ సినిమాలు అనుసరిస్తున్నాయి. ఈ ట్రెండ్ కొత్త ఆలోచనలకు అడ్డుపడుతోంది. కథను చెప్పే విధానం దాని నాణ్యత ను తగ్గిస్తుంది. పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే బలమైన కథాంశాలపై దృష్టి పెట్టాలి. అలా ఇప్పటికే చాలా సినిమాలు మంచి కథల వల్ల విజయం సాధించాయి. అంతేకానీ “పాన్-ఇండియా” అనే పేరు వల్ల కాదు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మంచి కథ ఉంది కంటెంట్ ఉంది. అలాగే ‘స్త్రీ’ వంటి సినిమాలు కూడా పాన్-ఇండియా చిత్రాలుగా గుర్తింపు పొందక పోయినా గొప్ప విజయాన్ని సాధించాయి. పెద్ద బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్-ఇండియా సినిమాలలో కేవలం 1% మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ విషయాని ఎందుకని గమనించడం లేదు. కలెక్షన్ల కోసం ఎక్కువ చిత్రాలు తీయడం వల్ల సినిమా నిర్మాణ నాణ్యత దెబ్బతింటోంది’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.