పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ లో భాగంగా ప్రోమో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ”అంట ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిని ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ రేపు విడుదల చేయనుంది చిత్ర బృందం. కాగా… ఈ సినిమా జవనరి 12న విడుదల కానుంది.