Ante Sundaraniki : అంటే.. సుందరానికీ ట్విట్టర్ రివ్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని హీరోగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ‘అంటే.. సుందరానికీ’. ఈ సినిమాకు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ అమాయకపు బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. బ్రాహ్మణ కుర్రాడు, క్రిస్టియన్ అమ్మాయిల మధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా విడుదలైంది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు.
Also Read
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
‘అంటే సుందరానికీ’లో కామెడీ, ఎమోషనల్ రెండూ వర్కౌట్ అయ్యాయి. ఒక్కోసారి లెంగ్తీగా అనిపించినా, రొటీన్ కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది. భావోద్వేగాలు బాగా పనిచేశాయి. నాని, నజ్రియా, మిగతా నటీనటులు పర్ఫెక్ట్గా నటించారు. ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అలాగే.. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ చాలా బాగుంది. వివేక్ ఆత్రేయకు మరో విజయం దక్కింది. నాని, నజ్రియా, హర్షవర్థన్, నరేశ్‌ల యాక్టింగ్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా ప్రేక్షకులకు కామెంట్లు చూస్తుంటే.. మరో హిట్ నాని ఖాతాలో చేరినట్లే కనిపిస్తోంది.
#AnteSundaraniki A Classy Romantic Comedy that is both Entertaining and Emotional!
The movie is engaging even though it feels lengthy at times and comedy is natural. The emotions worked well. Nani, Nazriya, and the rest of the cast was perfect.
Go for it 👍
Rating: 3.25/5
— Venky Reviews (@venkyreviews) June 9, 2022
1st second to last second completely connected to the movie and major sandeep… theatres lone chudali experience cheyal ante
Intha kanna tribute undadu aayana ki @AdiviSesh 👍👍#Major #MajorTheFilm
— intellectual feels (@JakDexxter) June 5, 2022
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!