శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది నిబ్బా నిబ్బి స్టోరీ కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు రోషన్. హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన ఫిల్మ్ పెళ్లి సందడి. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడక్షన్ అయిన శ్రీలీల ఇప్పుడు సౌత్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ రోషన్ పెళ్లి సందడి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది లేదు.
Also Read : Kollywood : 96 దర్శకుడితో మలయాళ స్టార్ హీరో.. ఇక రక్తపాతమే
మోహన్ లాల్ బైలింగ్వల్ ఫిల్మ్ వృషభలో ఆఫర్ రాగా, కొంత షూటింగ్ కంప్లీటయ్యాక క్విట్ అయ్యాడు రోషన్. ప్రజెంట్ అతడి చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ ఛాంపియన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ఫిల్మ్స్‌ను స్వప్న సినిమాస్ నిర్మిస్తోంది. ఐదు నెలల క్రితం రోషన్ బర్త్ డేకు ఎనౌన్స్ చేసిన గ్లింప్స్ వీడియో తప్ప మరో అప్డేట్ లేదు. కానీ రీసెంట్లీ ఓ అప్డేట్ పంచుకుంది. రోషన్ జోడీగా మలయాళ కుట్టీ అనశ్వర రాజన్‌ను పట్టుకొచ్చారు మేకర్స్. చంద్రకళగా ఆమె కనిపించబోతుంది. బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేసింది స్వప్న సినిమాస్. అనశ్వర రాజన్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ముఖ్యంగా ఓటీటీ అండ్ మలయాళ ఫిల్మ్ లవర్స్‌కు ఆమె ఫేస్ రిజిస్టరే. 15 ఏళ్లకే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ కుట్టీ సూపర్ శరణ్య, నేరు, గురువాయిరు అంబలనడయిల్, రేఖా చిత్రంతో ఫేమ్ తెచ్చుకుంది. బైలింగ్వల్ ఫిల్మ్ 7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే ఇప్పుడు చాంపియన్‌తో ఇంట్రడక్షన్ అవ్వబోతుంది. రోషన్‌తో నటించిన శ్రీలీల టీటౌన్‌ను ఏలేస్తుంటే మరి అనశ్వర లక్ ఫ్యాక్టర్ ఎలా డిసైడ్ అయ్యిందో తేలాలంటే చాంపియన్ రిజల్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే.