సిద్ధార్థ్.. ఒకప్పడు తమిళ్ కంటే తెలుగులోనే స్టార్ హీరోగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు సిద్దార్ధ్ సినిమాలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. సిద్దు నటించిన కొన్ని సినిమాలైతే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేదు. ఆ మధ్య వచ్చిన చిన్ని హిట్ అయింది తప్ప మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియదు.
Also Read : Wamiqa : చేసిన సినిమాలు అలా.. కంప్లీటైన సినిమాలు.. పరిస్థితి మరోలా
కానీ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సిద్దార్ధ్. ఈ ముదురు కుర్ర హీరో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘3BHK’. శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ గ్లిమ్స్, టీజర్ మెప్పించింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది జులై 4న వరల్డ్ వైడ్ గా ‘3BHK’ ను సేల్( రిలీజ్) కు తీసుకురానున్నారు మేకర్స్. అందుకు సంబంధించి అధికారక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా తమిళ్ థియేట్రికల్ రైట్స్ ను S.P సుబ్బయ్య కొనుగోలు చేసారు.