Hamas: ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో అగ్ర నాయకుల మరణాల తరువాత, ఇప్పుడు హమాస్ తన సంస్థాగత నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి రడీ అవుతుంది. హమాస్ తన కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ సంవత్సరం అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తుందని సూచించింది. సోమవారం హమాస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికలకు అంతర్గత సన్నాహాలు జరుగుతున్నాయని, పరిస్థితులు అనుకూలించిన చోట ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
READ ALSO: Yellamma: టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమా..!
పలు నివేదికల ప్రకారం.. ఈ ఎన్నికలు జనవరి 2026లో జరగవచ్చు. అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత ప్రారంభమైన యుద్ధంలో ఈ సంస్థకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు మరణించారు. హమాస్ నాయకత్వ ప్రక్రియలో కీలకమైన భాగం 50 మంది సభ్యులతో కూడిన కొత్త షురా కౌన్సిల్ ఏర్పాటు. ఇది ఒక సలహా సంస్థ. దీనిలో ఎక్కువ మంది మత నాయకులు ఉంటారు. దీని సభ్యులు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు. షురా కౌన్సిల్ సభ్యులను హమాస్ మూడు శాఖలు ఎన్నుకుంటాయి. గాజా స్ట్రిప్, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, విదేశాల నాయకత్వం ఆధ్వర్యంలో వీరిని ఎన్నుకుంటారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇజ్రాయెల్ జైళ్లలోని హమాస్ ఖైదీలు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.
గతంలో యుద్ధానికి ముందు జరిగిన ఎన్నికలలో గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని మసీదులతో సహా వివిధ ప్రదేశాలలో సమావేశాలు జరిగేవి. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి, షురా కౌన్సిల్ 18 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరోను, దాని అధిపతిని ఎన్నుకుంటుంది. ఆయనను హమాస్ అత్యున్నత నాయకుడిగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి, పొలిటికల్ బ్యూరో ఎన్నికల తేదీని ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.
హమాస్ అత్యున్నత నాయకుడు ఎవరు కాబోతున్నారు..
పలు నివేదికల సమాచారం ప్రకారం.. ఈ ఉగ్ర సంస్థకు కొత్త సుప్రీం లీడర్ కోసం రెండు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఖలీల్ అల్-హయ్యా, ఖలీద్ మషాల్. 65 ఏళ్ల ఖలీల్ అల్-హయ్యా గాజాకు చెందినవాడు, కాల్పుల విరమణ చర్చలలో హమాస్ ప్రధాన సంధానకర్తగా కూడా ఉన్నాడు. ఆయనకు షురా కౌన్సిల్, హమాస్ సైనిక విభాగం, అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మద్దతు ఉంది. ఖలీద్ మషాల్ గతంలో 2004 నుంచి 2017 వరకు పొలిటికల్ బ్యూరో అధిపతిగా పనిచేశాడు. ప్రస్తుతం సంస్థ డయాస్పోరా కార్యాలయానికి నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే హమాస్ అధినేత కాబోయే వారి పేర్లలో వెస్ట్ బ్యాంక్ నాయకుడు జహెర్ జబారిన్, షురా కౌన్సిల్ అధిపతి నిజార్ అవదల్లా పేర్లు కూడా చర్చలోకి వస్తున్నాయి.
జూలై 2024లో టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ హత్య చేసిన తరువాత, గాజా నాయకుడు యాహ్యా సిన్వార్ కొత్త నాయకుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 7 దాడికి సిన్వార్ ప్రధాన సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే ఆయన కూడా మూడు నెలల తర్వాత రఫాలో మరణించాడు. తదనంతరం హమాస్ ఖతార్‌లో ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక నాయకత్వ కమిటీని ఏర్పాటు చేసి, సుప్రీం నాయకుడి నియామకాన్ని ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేసింది.
READ ALSO: Toxic Movie Teaser: ‘టాక్సిక్’ టీజర్‌కు సర్టిఫికేట్ అవసరం లేదన్న సెన్సార్ బోర్డు!