Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వ‌హించ‌బోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌పై ప్రధానంగా చ‌ర్చించే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమావాళ్లు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. అలాగే, ఏపీలో థియేటర్ల పరిస్థితి.. సదుపాయాలకు సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు.. థియేటర్ లలో తనిఖీలు చేపట్టారు.
సమావేశంలో పాల్గొనే ప్రముఖులు
ఈ సమావేశంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రశ్రేణి వ్యక్తులు పాల్గొననున్నారు. వారిలో కొందరు:

నిర్మాతలు:

  • దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
  • ఆచంట గోపి(14 రీల్స్)
  • అశ్వినీ దత్ (వైజయంతీ మూవీస్)
  • డివివి దానయ్య (డివివి ఎంటర్‌టైన్‌మెంట్)
  • కేవీ రామారావు
  • సుప్రియ

 

దర్శకులు:

  • వీర శంకర్(దర్శకుల సంఘం అధ్యక్షుడు)
  • బోయపాటి శ్రీను
  • నాగ్ అశ్విన్ (మహానటి, కల్కి 2898 AD ఫేమ్)
  • త్రివిక్రమ్ శ్రీనివాస్

 

నటులు:

  • నందమూరి బాలకృష్ణ
  • వెంకటేష్
  • మంచు మనోజ్
  • నాని
  • సుమన్
  • ఆర్ నారాయణమూర్తి
  • నారా రోహిత్
  • బెల్లంకొండ శ్రీనివాస్
  • మంచు విష్ణు

 

నటీమణులు:

  • జయప్రద
  • జయసుధ
  • జీవిత