బాలీవుడ్ నటి అనన్య పాండేకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ 2019లో “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2” చిత్రంతో తెరంగేట్రం చేసింది. “పతి పత్ని ఔర్ వో అండ్ కాలి పీలి” అనే చిత్రంలో కూడా కన్పించింది. ఆమె నెక్స్ట్ మూవీ “లైగర్”. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది అనన్య. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో రూపొందుతోంది. ఇంకా దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఒక చిత్రం కూడా చేస్తోంది. కాగా ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. అనన్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే?
ఇందులో ఆమెవైట్ డ్రెస్ ధరించి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కన్పిస్తోంది. ఆ పిక్స్ కు “నా కహో నా ప్యార్ హై’ మూమెంట్” అంటూ కామెంట్ చేసింది. హృతిక్ రోషన్, అమీషా పటేల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “కహో నా ప్యార్ హై” చిత్రంలోని ఓ సీన్ ను రీక్రియెట్ చేయడానికి ఈ బ్యూటీ ప్రయత్నించడంపై పలువురు యంగ్ స్టార్స్ స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఆమె అభిమానులు ఆ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తూనే భారీ సంఖ్యలో షేర్ చేసుకుంటున్నారు.