విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకన్న ఈ మూవీలో.. ఇప్పటి వరకు రొమాంటిక్, మాస్ యాక్షన్, ఎమోషనల్ కథాంశాలతో ప్రేక్షకుల మనసు దోచిన విజయ్.. తన దృష్టిని పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా వైపు మళ్లించారు. ఈ సినిమాతో ఆయన తన కెరీర్‌లో కొత్త పేజీ తెరుస్తారని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ‘అన్న అంటేనే..’ అనే పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. అన్నదమ్ముల అనుబంధాన్ని స్పృశించే ఈ సాంగ్‌ను చూసి విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో తన చిన్నప్పటి ఫోటోలతో కలిసి విజయ్‌తో ఉన్న కొన్ని జ్ఞాపకాలను పంచుకుంటూ, ఓ హార్ట్‌టచ్ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read : Mukesh Chhabra : సీత గా నటించే హక్కు సాయిపల్లవికి మాత్రమే ఉంది..
ఆనంద్ అందులో ఇలా పేర్కొన్నారు.. “ఈ పాట విని ఎమోషనల్ అయ్యాను. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా అన్న విజయ్ ముందుండేవాడు. నా కలల్ని తనవిగా భావించి పోరాడేవాడు. తోబుట్టువుల ప్రేమ అంటే బయటకు చెప్పకుండా, లోపల నుంచి ఆప్యాయంగా ఉండే ప్రేమ అని నాకు మా అన్నని చూస్తే అర్థమయ్యింది. బహుశా ఈ పాట మా ఇద్దరిద్దరిని ఊహించి రాసినట్టుంది. అన్న అంటే నీలా ఉండాలి” అంటూ విజయ్‌ను ట్యాగ్ చేశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు ఆనంద్ సెన్సిటివిటీ పై ఫిదా అవుతున్నారు. అన్నదమ్ముల బంధాన్ని హత్తుకునేలా చూపిస్తూ వచ్చిన ఈ పాట, విజయ్–ఆనంద్ మధ్య ఉన్న ప్రేమను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.