బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ 2025 డిసెంబర్ 5న విడుదలైంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లను దాటింది. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కాబోతోంది. అయితే బాలీవుడ్‌లో ధురంధర్ తుఫాను మధ్య రణవీర్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Realme 16 Pro 5G Launch: రియల్‌మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్ అవసరం లేదు!
రణ్‌వీర్ సింగ్ తొలి చిత్రం ‘బ్యాండ్ బాజా బారాత్’ థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. జనవరి 16న విడుదల కానుంది. ఓవైపు ధురంధర్ బ్లాక్ బస్టర్ హిట్, మరోవైపు బ్యాండ్ బాజా బారాత్ సినిమాకు 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో యష్ రాజ్ ఫిల్మ్స్ రీ-రిలీజ్ చేస్తోందని సమాచారం. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించారు. 2010లో విడుదలైన బ్యాండ్ బాజా బారాత్ మూవీ రొమాంటిక్ కామెడీలలో ఒకటిగా నిలిచింది. రణవీర్, అనుష్కల కెమిస్ట్రీని అందరూ ఎంజాయ్ చేశారు.