కరోనా మహమ్మారి కాస్త నిదానించడంతో చిత్ర పరిశ్రమ కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పటికే థియేటర్లలలో కొత్త సినిమాల సందడి మొదలయ్యింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, స్టార్ హీరోల స్పీచ్ లతో కళకళలాడుతోంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ చిన్న సినిమాలను, ఇతర హీరోలను ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అందులో ముందుంటాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ కి అటెండ్ అయిన బన్నీ తాజాగా ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నాడు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29 న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నెల 27 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. గత కొన్ని సినిమాలతో ప్లాప్స్ చవిచూసిన నాగ శౌర్య ఈ సినిమాతోనైనా హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.