ఎక్కడ చుసిన పుష్ప..పుష్ప.. పుష్ప.. ఇప్పుడిదే ఫీవర్ సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తుంది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. నేడు స్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. మరోవైపు ఈ సినిమా టికెట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ స్క్రీన్స్ లో బ్లాక్ లో ఒక్కో టికెట్ రూ. 3000 పలుకుతుంది.
Also Read : Pushpa 2: మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్.. అందరిలోనూ అదే డౌట్
అటు ఓవర్సీస్ లోను పుష్ప క్రేజ్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటికె అత్యంత వేగంగా 1 మిలియన్ దాటి 2 మిలియన్ మార్క్ కూడా దాటి 3 మిలియన్ కు చేరుకుంది పుష్ప -2. కాగా ఇప్పుడు పుష్ప -2 మరో రేర్ ఫీట్ ను అందుకుంది. ఎంటైర్ ఓవర్సీస్ కలిపి సినిమా 4 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఏరియల వారీగా చుస్తే నార్త్ అమెరికాలో $2.7 మిలియన్, UK లో $385K, ఆస్ట్రేలియాలో $225K, న్యూజిలాండ్ $25k, గల్ఫ్ లో $304K, రెస్ట్ అఫ్ ది వరల్డ్ – 375K రాబట్టి మొత్తం $4.14 మిలియన్ కొల్లగొట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమాను ప్రత్యంగిర సినిమాస్ అలాగే AA సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సమానంగా ఒకే టైమ్ లో ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది పుష్ప -2. హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కలెక్షన్స్ ను బట్టి చుస్తే పుష్ప గాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నిరూపించాడు.