Pushpa 2: మరికొన్ని గంటల్లో పుష్ప ప్రీమియర్స్.. అందరిలోనూ అదే డౌట్
- నేడే పుష్ప -2 స్పెషల్ ప్రీమియర్స్
- భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పుష్ప -2
- హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2′ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. ఇక నైజాంలోని అన్ని సింగిల్ థియేటర్స్ లో ప్రీమియర్స్ పడనునున్నాయి.
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్పను అందరి కంటే ముందే చూడాలనే క్రేజ్ ఆడియెన్స్ లో విపరీతంగా ఉంది. ఆ ప్రభావం ప్రీమియర్ బుకింగ్స్ లో కనిపించింది. ప్రీమియర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంతటి భారీ రిలీజ్ అవుతున్న పుష్పపై అందరిలోను ఒకటే డౌట్ ఉంది. అదేమంటే పుష్ప -2 డే -1′ RRR’ రికార్డును బద్దలు కొట్టగలుగుతుందా లేదా అనేది ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశం గా మారింది. రాజామౌళి తెరకెక్కించిన RRR మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 223 కోట్లు రాబట్టి ఇండియా బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ గా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఇప్పటికే పుష్ప – 2 అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 100 కోట్లు దాటేశాయి. ఇదే ఊపు మొదటి రోజు కూడా కొనసాగి రాజమౌళి సినిమాను బీట్ చేస్తుందని ఫ్యాన్స్ లెక్కలు కడుతున్నారు. దాదాపు 3.20 గంటల నిడివితో వస్తున్న పుష్ప -2 ఏ మేరకు ఆకట్టుకుంటుందో మొదటి రోజు ఏ మేరకు రాబడుతుందో అనే క్యూరియాసిటీ అటు ఫ్యాన్స్ లోను ఇటు ట్రేడ్ లోను ఉంది.
Also Read
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
- OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
తాజావార్తలు
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!