Allu Arjun to do Kalki Like Film with Trivikram: అల్లు అర్జున్ సినిమాల లైనప్ లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పుష్ప రెండో భాగాన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ కావడంతో డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆటకెక్కింది ప్రస్తుతానికి ఆ సినిమా చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. అయితే ఆ సినిమా కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
Ariyana: రాజ్ తరుణ్ ప్రియురాలు ఆరోపణలు.. క్లీవేజ్ అందాలతో అరియనా బిగ్ ట్రీట్!
అల్లు అర్జున్ ఇమీడియట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. పుష్ప రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని 2025 మేలో త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. త్రివిక్రమ్ సబ్జెక్ట్ చాలా భారీగా కల్కి మోడల్లో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 2027 జనవరి రిలీజ్ చేసే యోచనలో కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ చాలా వరకు సాంఘిక సినిమాల చేస్తూ వచ్చాడు కానీ బన్నీతో మొట్ట మొదటి సారిగా మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి సినిమాలకి డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.