ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న NATS (North America Telugu Society) 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్నీకి నాట్స్ సంస్థ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సమక్షంలో అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం రావడం అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహాన్ని నింపింది.
Also Read : Anasuya: నీ కాణంగానే వెళ్లిపోయా.. అంటూ ఆది పై అనసూయ ఫైర్!
ఈ మూడు రోజుల సుదీర్ఘ వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నప్పటికీ, అల్లు అర్జున్ మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బన్నీకి ఉన్న ఫ్యాన్ బేస్ విశేషమైనది. ఈ నేపథ్యంలో, NATS వేదికపై ప్రత్యక్షంగా అభిమానులను కలవడం ద్వారా ఆయన భవిష్యత్ చిత్రాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత క్రేజ్ పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా బన్ని తో పాటు తన ఫ్యామిలి కూడా ఇందులో భాగం కావడం విశేషం. ఇందుకు సంబంధించన ఫోటోలు వైరల్ వైరల్ అవుతున్నాయి. పుష్పతో నేషనల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు ఈ తరహా అంతర్జాతీయ ఈవెంట్ల ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు.