టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా తమతో రావాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను బట్టలు మార్చుకుంటాను అని చెప్పిన వినకుండా పోలీసులు తమతో వచ్చేయాలని బలవంతం చేయడంతో బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదు కానీ కాస్త సమయం ఇవ్వాలి కదా అని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు వెళ్లేందుకు అల్లు అరవింద్ ప్రయత్నించగా పోలీసులు అల్లు అరవింద్ ని వారించారు.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్
దీంతో అల్లు అర్జున్ తాను వెళ్లి వస్తానని తండ్రికి, భార్యకి చెప్పి పోలీసులతో వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపద్యంలో అల్లు అర్జున్ ని ముందుగా చిక్కడపల్లి పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. కానీ గాంధీ హాస్పిటల్ కి టెస్ట్స్ నిమిత్తం తీసుకు పోయినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం క్రాష్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని ఈరోజు కోర్టులో అల్లు అర్జున్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ని రెండున్నర గంటలకు విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది. ఇక ఈ అంశం మీద ఇప్పటికే సిపి సివి ఆనంద్ స్పందించారు. అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులోనే అల్లు అర్జున్ రెస్ట్ అయినట్లుగా ఆయన వెల్లడించారు.