Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పోలీసులు
- అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం
- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్-సీపీ సీవీ ఆనంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు కాగా 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు. దానికి 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లిన తర్వాత పోలీసులు ఈ అరెస్టు గురించి స్పందించారు . పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రీమియర్స్ మాత్రం ఒకరోజు ముందుగానే ప్రదర్శించారు.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి తన ఫ్యామిలీతో కలిసి సినిమా వీక్షించేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో టికెట్ లేని చాలామంది అల్లు అర్జున్ వస్తున్నాడని ఆయనను చూసేందుకు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వస్తున్నట్లు ముందుగా అనుమతి తీసుకోకపోవడం కనీసం థియేటర్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం సహా అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం మీద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!