‘పుష్ప 2’ విజయంతో మాస్ హైప్‌ను అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాత్కాలికంగా AA22xA6 పేరుతో రూపొందుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ – ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తుందనే టాక్ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పడుకొనే హీరోయిన్‌గా ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి నటీమణులు కీలక పాత్రలో కనిపించబోతున్నారనే బజ్ కొనసాగుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం..
Also Read : Bollywood : 51 ఏళ్ల వయసులో.. రెండో పెళ్లికి రెడీ అయిన హాట్ హీరోయిన్..!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఒక శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. బాహుబలి సిరీస్‌లో శివగామిగా తిరుగులేని హోదా దక్కించుకున్న రమ్యకృష్ణన్, అల్లు అర్జున్–అట్లీ కాంబోలో కొత్తగా చేరడం సినిమా రేంజ్‌ను మరింత పెంచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్–మృణాల్ ఠాకూర్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రాబోయే షెడ్యూల్స్‌లో రమ్యకృష్ణన్ సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. 2026 చివర్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదే కనుక జరిగితే రమ్యకృష్ణన్ ఎంట్రీతో ఈ డ్రామా మరింత బలపడటం కాయం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.