నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ తాండవం’. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read:Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
ఈ నేపథ్యంలో, డిసెంబర్ 12వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతున్న కొన్ని సినిమాలు తమ రిలీజ్ వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే ‘మోగ్లీ’ టీమ్ తమ సినిమాని వాయిదా వేసుకుంటున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక, వంశీ నందిపాటితో బన్నీ వాసు కలిసి రిలీజ్ చేయాల్సిన ‘ఈషా’ అనే ఒక హారర్ థ్రిల్లర్ సినిమాని సైతం వాయిదా వేసుకుంటున్నట్లుగా సమాచారం.
Also Read: Hardik Pandya: వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..
అయితే, తమ కంటెంట్ మీద నమ్మకంతో శ్రీ నందు హీరోగా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరించిన ‘సైక్ సిద్ధార్థ’ అనే సినిమా మాత్రం రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో, థియేటర్ల టెన్షన్ తమకు ఉండదని టీమ్ భావిస్తోంది. మరోపక్క, కార్తీ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమాని కూడా ముందు అనుకున్నట్టుగానే డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి, అది తమిళనాడు డబ్బింగ్ సినిమా కావడంతో, ఆ సినిమా థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు అని టీమ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చెప్పుకోదగ్గ సినిమాలలో రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు.