హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్‌లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్.
Also Read : Sreeleela : అందం.. అమాయకత్వం కలగలిపిన శ్రీలీల
ఇక రీసెంట్లీ రిలీజైన గుడ్ బ్యాడ్ అగ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అదరగొట్టాడు అజిత్. అయితే ఇప్పడు అంతా ఏకే 64పైనే నడుస్తోంది. అజిత్ నెక్ట్స్ సినిమాను డీల్ చేసేది ఎవరన్న డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్ కు వినిపించాడు. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తీసుకురాబోతున్న అజిత్ 64ను నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీని తర్వాతే ధనుష్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఏకే 64 గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి. గుడ్ బాడ్ అగ్లీతో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ కొట్టాడు ఆదిక్ అలాగే మైత్రిమూవీ మేకర్స్.