కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ఒకరు. అజిత్ సినిమా రిలీజ్ అయితే అయన అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. ఇక అజిత్ కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే మక్కువ ఎక్కవ. గతంలోను ఫార్ములా వన్ రేసింగ్ పాల్గొని మెడల్స్ సాధించాడు అజిత్. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఒక టీమ్ ను రెడీ చేసి ఈ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రేసింగ్ లో పాల్గొని మెడల్ సాదించాడు.
Also Read : Ruhani sharma : అదిరిందమ్మా.. రుహాణి శర్మ
తాజాగా స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో పాల్గొన్నాడు అజిత్. అయితే రేసింగ్ లో భాగంగా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ముందుగా వెళుతున్న కారును క్రాస్ చేసి వెళ్లే టైమ్ లో ఆ కారును ఢీ కొట్టింది. దీంతో ఫుల్ స్పీడ్ లో వెళుతున్న అజిత్ కారు రేసింగ్ ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ఈ సంఘటన అజిత్ కారులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. కాగా ఈ ప్రమాదంలో అజిత్ కు గాయాలేమి కాలేదని అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ తెలియజేస్తూ ప్రమాదం సంబంధిత వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు. హీరో తప్పు ఏమీ లేదు, ముందు వెళుతున్న కారు వల్ల ఈ ప్రమాదం జరిగింది అని తెలిపింది. ప్రమాదం జరిగిన కొంత సమయానికి అజిత్ కారు నుండి బయటకు వచ్చి అభిమానులతో ఫొటోలు దిగి, తిరిగి రేస్ కొనసాగిస్తున్నట్లు తెలియజేసారు. ఈ ప్రమాదం నుండి అజిత్ సురక్షితంగా బయటపడడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. వరుస ప్రమాదాలతో అజిత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.