ఈ మధ్య కాలంలో హిస్టారికల్ , త్రిల్లింగ్, హారర్ మూవీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూశాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్ లో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో యువ హీరోలు మాస్ ఇంకా లవ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ఇలాంటి కథలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా ‘రంగం’ మూవీ ఫేమ జీవా కూడా చేరాడు.
Also Read:Retro: ఫస్ట్ సింగిల్ సాంగ్కు డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రెట్రో’ ..
కోలివుడ్ యంగ్ హీరో జీవా గురించి పరిచయం అక్కర్లేదు హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా మంచి కథలను ఎంచుకుంటూ తన కంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక జీవా నటిస్తున్న తాజా చిత్రం ‘అఘత్యా’. ఫిబ్రవరి 28న గ్రాండ్ గా విడుదల కానుంది. డాక్టర్ ఇషారి గణేష్, అనీష్ అర్జున్ దేవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పా. విజయ్ దర్శకత్వం వహించాడు.యాక్షన్ కింగ్ అర్జున్, రాశీ ఖన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో జీవా ఓ భయానకమైన ప్రదేశంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ దశాబ్దాలుగా ఆత్మల నివాసంగా ఉందన్న ప్రచారం ఉంటుంది. జీవా తన పాత్ర ద్వారా ఆ భవంతి గతాన్ని, వర్తమానాన్ని అన్వేషించడానికి ప్రయాణం చేస్తాడు. ఇక్కడే అర్జున్ పాత్రకు, అతనికి మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయని తెలుస్తోంది. గతం, వర్తమానం కలిసిపోయేలా ఉండే ఈ కథ ఉత్కంఠను కలిగించేలా ఉంది. మొత్తంగా చూసుకుంటే హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. దీంతో మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది.