Adivi Sesh: అడివి శేష్ కొత్త సినిమా.. హీరోయిన్ కోసం అన్వేషణ.. డైరెక్టర్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adivi Sesh New Movie with Rahul Ravindran: టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘గూఢచారి 2’ (జి2)లో నటిస్తున్నారు. 2018లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం జి2 షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.
జి2 షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఇరువురి మధ్య చర్చలు పూర్తయ్యాయని, శేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎంపికపై చిత్ర బృందం దృష్టి పెట్టిందట. కథానాయిక ఖరారైన తర్వాత ఈ నెలాఖరులోనే నిర్మాణ సంస్థతో పాటు సినిమా గురించి మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్‌కు పండగే!
- Satvika Veeravalli: 'RC 17' సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
- Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
- Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
సొంతం (2002) చిత్రంలో కనిపించిన అడివి శేష్.. కర్మ (2010)తో నటుడిగా, దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆపై పంజా (2011), బలుపు (2013), రన్ రాజా రన్ (2014), బాహుబలి: ద బిగినింగ్ (2015) చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. క్షణం (2016), గూఢచారి (2018), ఎవరు (2019), మేజర్ (2022), హిట్: ద సెకండ్ కేస్ (2022), డకోయిట్: ఎ లవ్ స్టోరీ (2026) చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఎప్పటికప్పుడు వైవిధ్య కథలను ఎంచుకునే శేష్.. ఈసారి ఏ తరహా కథలో వస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Adivi Sesh: అడివి శేష్ కొత్త సినిమా.. హీరోయిన్ కోసం అన్వేషణ.. డైరెక్టర్ ఎవరంటే?
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
Vijayawada: వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం వేళ కూటమిలో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా!
-
Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..