Vijayawada: వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం వేళ కూటమిలో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ప్రమాణ స్వీకార కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. నగర మేయర్‌గా వంగవీటి రాధాతో పాటు 86 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బెజవాడకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అది కూడా అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలే కావడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరుకాలేదు. వీరితో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కీలక నేతలు ఒకే కార్యక్రమానికి గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించే విషయంలో ప్రోటోకాల్ పాటించలేదనే అసంతృప్తి ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల్లో వ్యక్తమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆహ్వానాల విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొందరు నేతలు అలిగినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయా? అనే చర్చ మొదలైంది.
Also Read
- AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. ఫేజ్-IIలో 25 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు
- Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
- Vijayawada Politics: విజయవాడ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై రాజకీయ దుమారం
అయితే ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదని వారి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. గైర్హాజరుకు వ్యక్తిగత కారణాలేనా? లేక ఆహ్వానాలు, ప్రోటోకాల్ విషయంలో అసంతృప్తి కారణమా? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేయర్‌గా వంగవీటి రాధా బాధ్యతలు స్వీకరించిన వేళ కీలక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కార్యక్రమానికి దూరంగా ఉండటం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు వెనుక కారణాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.
తాజావార్తలు
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
Vijayawada: వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం వేళ కూటమిలో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా!
-
Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
-
Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..