Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్‌కు పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sree Vishnu About 2027 Sankranti Films Competition: టాలీవుడ్ క్రేజీ హీరో శ్రీవిష్ణు సంక్రాంతి బరిలో ఉన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తుండగా.. నరేశ్, మురళీ శర్మ, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది.
ఈ సందర్భంగా సంక్రాంతి సినిమాల పోటీ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు శ్రీవిష్ణు ఆసక్తికరంగా స్పందించారు. ఈ సంక్రాంతికి పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు విడుదలవుతున్న నేపథ్యంలో పోటీని ఎలా చూస్తున్నారని ప్రశ్నించగా.. అవన్నీ పెద్ద సినిమాలని, వాటితో తమకు అసలు పోటీ లేదని చెప్పాడు.’అవన్నీ పెద్ద సినిమాలు. మేము అసలు పోటీలోనే లేము. ఈ సంక్రాంతికి మాకు ఓ స్పేస్ దొరికింది. అందుకే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. సినిమా ఫస్టాఫ్‌ను యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాలో యాక్షన్ కూడా ఉంటుంది. అయితే అది కేవలం డైలాగ్స్‌తోనే ఉంటుంది’ అంటూ శ్రీవిష్ణు నవ్వులు పూయించారు.
Also Read
- Satvika Veeravalli: 'RC 17' సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
- Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
- Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
- Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
ఈ సంక్రాంతి తనకు చాలా ప్రత్యేకమని శ్రీవిష్ణు చెప్పారు. ‘నేను వెంకీ సర్ అభిమానిని. ఆయన సినిమాతో పాటు నా సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్ సంక్రాంతి. ఫ్యామిలీ ప్యాక్ వెంకటేష్ గారి అభిమానులకు మరింత బాగా నచ్చుతుంది’ అని చెప్పారు. ఫ్యామిలీ ప్యాక్ వైవిధ్యభరితమైన కథతో రూపొందిన సినిమా అని చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోనే ఓ కొత్త కోణాన్ని చూపించబోతున్నామని, ఆ ప్రత్యేక అంశం టీజర్ లేదా ట్రైలర్లో లేదని, దాన్ని థియేటర్లలోనే చూసి అనుభూతి చెందాలని చెప్పారు. సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, ఇందులోని పాత్రలన్నీ విభిన్నంగా ఉంటాయని, వాటిని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘జనవరి 12 విడుదల’ మూవీ జనవరి 12కి రిలీజ్ అవుతుంది. వెంకీకి శ్రీవిష్ణు పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్‌కు పండగే!
-
Tragedy: స్కూల్ బస్సును ఢీకొన్న లారీ.. నలుగురు చిన్నారులు మృతి, 35 మందికి గాయాలు!
-
Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
-
Satvika Veeravalli: ‘RC 17’ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
-
Kavitha: ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వద్దు.. కొవ్వూరులో కవిత వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..